Tuesday, 3 November 2026

అన్నాభావు సాఠేకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ . అన్నాభావు సాఠేకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ

అన్నాభావు సాఠేకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ . అన్నాభావు సాఠేకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ .
గుడిహత్నూర్ : నవంబర్ 30( జనం సాక్షి) అన్నాభావు సాఠే మరణానంతరం ఆయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ రావడం హర్షించదగ్గ విషయమని అన్నాభావుసాఠే అసోసియేషన్  సెక్రటరీ గాయ్ కాంబ్లే బాలాజీ  అన్నారు. మహారాష్ట్రలోని మహాత్మా గాంధీ మిషన్ యూనివర్సిటీ ( ఎంజీఎం ) ఔరంగాబాద్ అధికారులు ఆదివారం సాఠే కోడలు సావిత్రిబాయిసాఠేకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అన్నాభావుసాఠే కమిటి  సభ్యులు మండల కేంద్రంలో బుధవారం సాఠే విగ్రహానికి  పూలమాలలు వేసి మిఠాయిలుపంచారు.అన్నాభావుసాఠే కు భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మలేకర్ విజయ్, గాయ్ కాంబ్లే  సుదర్శన్, గాయ్ కాంబ్లే మారుతి, సాగోరే లహుదాస్, లోఖండే ఆకాష్, గోట్ముకలే రామ్, గజ్ భారే కుశాల్, గాయ్ కాంబ్లే  నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు