లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 30 రోజులు ఉచిత డయాబెటిక్ క్యాంప్*
మెట్పల్లి టౌన్, నవంబర్ 30,
జనం సాక్షి:
మెట్పల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఉచిత మెగా డయాబెటిక్ క్యాంపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కట్కం రాకేష్ మాట్లాడుతూ ఈ మెగా ఉచిత డయాబెటిక్ క్యాంపు
ఈరోజుతో నెల రోజులు వరుసగా డయాబెటిక్ క్యాంపులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. ఈ చివరి రోజున వ్యవసాయ మార్కెట్ వద్ద హమాలి కార్మికులకు శిబిరంలో డయాబెటిక్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
150 మందికి పైగా ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా
ఈ నెలలో 30 రోజులపాటు రోజు వారీగా దాదాపు మూడు వేల మందికి పైగా పలు వాడల్లో ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగిందని ఈరోజుతో చివరి రోజు డయాబెటిక్ క్యాంపు ముగిసింది అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేశ్ , సెక్రటరీ ఇల్లందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూర్ రాకేష్ ,దొంతుల ఆంజనేయులు, ఇల్లందుల వెంకటేష్ శ్రీధర్ ,దొంతుల పవన్, కోటగిరి తిరుమల చారి, కోట విజయ్ కుమార్, నర్సింగరావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 30 రోజులు ఉచిత డయాబెటిక్ క్యాంప్




