Monday, 2 November 2026

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా చెక్కులు పంపిణీ

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా చెక్కులు పంపిణీ
తిరుమలగిరి (సాగర్) నవంబర్ 30 (జనంసాక్షి): అల్వాల అడ్డరోడ్డు లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కొత్తపల్లి శాఖ బ్యాంకు మేనేజరు కె జ్ఞానేశ్వర్ ఇటీవల మరణించిన ఖాతాదారుల కు మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రధానమంత్రి జీవనజ్యోతి ప్రమాద బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు .ఈ సందర్భంగా ఖాతాదారులకు ఫిక్స్డ్ డిపాజిట్స్, వికాస్ -666, వికాస్ -999, బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించుట, ప్రభుత్వ బీమా పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ,అటల్ పెన్షన్ ,ఎస్ బి ఐ లైఫ్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సాయి నిఖిల్, క్యాషియర్ అమర్ లింగేశ్వర్, మెసెంజర్ లక్ష్మీనారాయణ, కొత్తపల్లి సర్పంచ్ బూడిద స్వాతి, ఉప సర్పంచ్ ఉడుతూరి రామాంజిరెడ్డి, ఎంపిటిసి ఉర్లగొండ వెంకటయ్య ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.