జిన్నారం జూన్ 2(జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ తల్లి అబ్దుల్ కలాం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అలాగే గ్రామపంచాయతీ ఆవరణ మరియు బతుకమ్మ ఘాట్ తెలంగాణ వీరు అమర స్తూపం వద్ద ఇంచార్జ్ సర్పంచ్ మేడిపల్లి మురళి జాతీయ జెండాను ఆవిష్కరించారు!! ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జాతీయ జెండా ఆవిష్కరణ ఉత్సవాలు ప్రారంభమై అమరులను స్మరిస్తూ ఉత్సవాలు ముగిస్తాయి అని ఈ కార్యక్రమాలు పండుగ వాతావరణం లో జరుపుకునే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలు జరుపుకుంటామని అన్నారు గడిచిన తొమ్మిది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిని సాధించిందని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందన్నారు గడపగడపకు తెలంగాణ సంక్షేమ పథకాలతో దూసుకుపోతుందన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గుడం మహిపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో శరవేగంతో జరుగుతున్నాయని అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 20వ రోజు జరిగే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బ్యాగరి లక్ష్మి, పంచాయతీ సెక్రెటరీ సుదర్శన్, మాజీ సర్పంచ్ జయశంకర్ గౌడ్, పంచాయతీ సభ్యులు శేఖర్ గౌడ్, రమణి, నరహరి, నీనగోస్వామి, దర్గా బిక్షపతి, నాయకులు రుక్మారెడ్డి, ఎమ్మార్పీఎస్ పటాన్చెరు నియోజకవర్గం ఇంచార్జ్ కావలి ఐలయ్య మాదిగ, ప్రతాపరెడ్డి, తుపాకుల రాజు, సత్యం, బిక్షపతి, డప్పు శీను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షపతి, పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు యువకులు తదిరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
అన్నారంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇన్చార్జ్




