జిన్నారం జూన్ 2(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు!! ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి హెల్త్ సెంటర్, ప్రభుత్వ పాఠశాల, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు.
బొల్లారం మున్సిపాలిటీలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు




