జిన్నారం జూన్ 2(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రం గుమ్మడిదల పోలీస్ స్టేషన్లోలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు!! ఈ సందర్భంగా విజయ్ కృష్ణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ కృష్ణ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జాతీయ జెండా ఆవిష్కరణ ఉత్సవాలు ప్రారంభమై అమరులను స్మరిస్తూ ఉత్సవాలు ముగిస్తాయని ఈ కార్యక్రమాలు పండగ వాతావరణం లో జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని,అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలు జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఎస్సై మరియు పోలీస్ శాఖ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల “టానాలో” ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు




