Wednesday, 4 November 2026

అన్నారంలో బీరప్ప జాతరకు ఒక్క లక్షయాభై వేలు విరాళం అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్

 

 

 

 

 

 

 

జిన్నారం ఏప్రిల్ 19 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో శ్రీ.శ్రీ.శ్రీ.బీరప్ప కారమతి దేవత కళ్యాణ మహోత్సవానికి ఒక్క లక్ష యాభై వేల రూపాయల ను పటాన్చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ విరాళం బుధవారం ఉదయం నిర్వాహకులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, ఉమ్మడి జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మద్ది ప్రతాపరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిన్నారం ఎంపీపీ ధమ్మగొని రవీందర్ గౌడ్, బొంతపల్లి వీరభద్ర స్వామి మాజీ డైరెక్టర్ వడ్డేపల్లి మల్లేష్, అన్నారం గ్రామ, మాజీ పంచాయతీ సభ్యులు బ్యాగరీ బిక్షపతి, నరసింహారెడ్డి, క్షత్రి నారాయణ,వడ్డపల్లి వెంకటేష్ యాదవ్, యూత్ నాయకులు పల్నాటి వినోద్ కుమార్, నరసింహ యాదవ్, డప్పు శ్రీనివాస్, సాయికుమార్, పల్నాటి సత్యనారాయణ తదిరులు పాల్గొన్నారు.