*
జిన్నారం ఏప్రిల్ 19 జనం సాక్షి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో పండించిన పంటలను నిల్వ చేసుకొనుటకు గోదాములు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు! లక్షల్లో పెట్టుబడి పెట్టిన వచ్చిన ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. గుమ్మడిదల మండలం కొత్తపల్లి, నల్లవల్లి,మంబాపూర్, కానుకుంట, అన్నారం, వీరారెడ్డిపల్లి,నాగిరెడ్డి గూడెం, అనంతరం, రామ్ రెడ్డి బాయ్, దోమాడు గ్రామాలలో ఉల్లిగడ్డ వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు.కానీ గోదాములు లేక పంటను పొలాల వద్దనే విలువ వేసుకుంటున్నారు. కావున సంబంధిత శాఖ ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గుమ్మడిదల రైతులు కోరుతున్నారు.




