Friday, 6 November 2026

అన్నివర్గాలకు అభయహస్తం కాంగ్రెస్ పార్టీ

అన్నివర్గాలకు అభయహస్తం కాంగ్రెస్ పార్టీ…

భైంసా రూరల్ డిసెంబర్ 28 జనం సాక్షి

 

అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం లాంటిదని ముధోల్ కాంగ్రెస్ నాయకులు అన్నారు.బుధువారం బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క 138 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనందరావు పటేల్ పార్టీ జెండాను ఆవిష్కరించి,కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు.దేశ స్వాతంత్రం తెచ్చిన గొప్ప చరిత్రగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,తెలంగాణ రాష్ట్రము ఇచ్చినా పార్టీ కాంగ్రెస్ పార్టీఅని, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఎప్పుడు ప్రజలకోసం పాటుపడేదని తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 137 సంవత్సరాలు పూర్తయి 138 సంవత్సరంలోకి అడుగిడిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్టం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనో సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హైమత్ ఖాన్,ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఇన్చార్జి అంజాద్ షేక్, రామ్నాథ్ నాయక్,పండరి గౌడ్,విఠల్ రావు పటేల్, బాసర నాయకులు దేశ్ ముఖ్ రాజేశ్వర్,భగవాన్ పాటిల్,టోపీ ఇస్మిల్ తదితరులు పాల్గొన్నారు.