Friday, 6 November 2026

గ్రామ పంచాయతీ భవనాన్ని,శ్వాశన వాటికలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ భవనాన్ని,శ్వాశన వాటికలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్
కొండమల్లేపల్లి డిసెంబర్ 28 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లెపల్లి మండలం చిన్నఆడిశర్లపల్లి గ్రామంలో రూ.16లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని,చిన్నఆడిశర్లపల్లి గ్రామంలో రూ.12.60లక్షలతో నిర్మించిన శ్వాశన వాటికను,దోనయాల గ్రామంలో రూ.12.60 లక్షలతో నిర్మించిన శ్వాశన వాటికను దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.గ్రామాలను అని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ పసునూరు సరస్వతమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి, మారం రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్ ,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,మాజీ సర్పంచ్ అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్ ,స్థానిక సర్పంచులు గడ్డం శ్రీరాములు,కల్లు కవితఅరుణ్ రెడ్డి,రావుల వెంకటయ్య యాదవ్,రావుల సత్యనారాయణ యాదవ్, రమావత్ తూలిసిరామ్,ఐతపక సురేష్,మాజీ ఎంపీటీసీలు ముడావత్ పాండు, వెంకటేశ్వర్లు ,వస్కుల కృష్ణయ్య, గోవింద్,జాగృ బావోజి,శంకర్ నాయక్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.