Thursday, 5 November 2026

చైన్స్ స్నాచర్ దొంగ అరెస్ట్

చైన్స్ స్నాచర్ దొంగ అరెస్ట్

రామారెడ్డి డిసెంబర్ 28 ( జనంసాక్షి ) :

చైన్స్ స్నాచర్ దొంగ అరెస్ట్ చేశామని ఎస్ఐ అనిల్ కుమార్ వెళ్లడించారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి అన్నారం గ్రామంలో తేదీ 23 12 2022 నాడు జరిగిన దొంగతనం కేసును రామారెడ్డి పోలీసులు చేదించారని చెప్పారు. అన్నారం గ్రామానికి చెందిన వాంచా లక్ష్మీ నర్సవ్వ ఒకతే తన ఇంటి ముందర కూర్చొని ఉండగా దొంగ ఆమెతో మాట్లాడినట్లు నటించి ఆమె మెడలో నుండి తులం బంగారు పుస్తెలతాడును తెంపుకొని పోయినాడు. పోలీసులు విచారణ చేపట్టగా అన్నారం గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఉప్పు వెంకటి అనే వ్యక్తి అనుమాన పదస్థితిలో పోలీసులను చూసి పారిపోతుండగా, అతని వెంబడించి పట్టు కొన్నారు. అతని విచారించగా అతను కూలి పని చేస్తూ జల్సాకు అలవాటు పడి డబ్బులు లేక దొంగతనం చేయాలని ఉద్దేశంతో ఒంటరిగా ఇంటి ముందు కూర్చున్న లక్ష్మీనరసవ్వను గమనించి ఆమె మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును తెంపుకొని పోయినాడు. అతన్ని విచారించగా ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి తులం బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితు న్ని కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ వివరించారు.