Tuesday, 3 November 2026

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ వద్ద వాణిజ్య భవన్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.అన్నిదానాల్లో అన్నదానం గొప్పదని, ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి ఆకలి తీర్చడం గొప్ప పుణ్యకార్యమన్నారు. ప్రతి ఒక్కరు సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊట్కూరి సైదులు, వాంకుడోతు వెంకన్న, వాణిజ్య భవన్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు బెలిదే నాగేందర్, ఇమ్మడి సందీప్, వంగవీటి కిరణ్, మొరిశెట్టి నాగరాజు, ఎర్రమల్ల ప్రసాద్, అజిత్, నోముల సంతోష్, గోలి ఆనంద్,సాలయ్య, భిక్షం , వెంకట్, సందీప్,
తదితరులు పాల్గొన్నారు.