Tuesday, 3 November 2026

దశాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర సర్కార్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి

కమాన్ పూర్, జనం సాక్షి : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాన్ని ఈనెల జూన్ 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు పిలుపునిచ్చారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఏర్పాటు అయిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక రంగాల్లో అభివృద్ధి పురోగతి సాధిస్తూనే సంక్షేమ కార్యక్రమాలను గతంలో ఎన్నడూ లేని విధంగా దేశానికి ఆదర్శంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనిని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన లబ్ధిదారులకు నేరుగా దళారి వ్యవస్థ లేకుండా అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనాది కాలంలోనే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పురోగతి సాధించిందన్నారు రహదారుల విస్తరణ, చెరువుల, కుంటల అభివృద్ధి కార్యక్రమం ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటి సౌకర్యం రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు పథకం, రైతు బీమా పథకం, తోపాటు పింఛన్లు 2000 పెంచి, వితంతు, వికలాంగు, వృద్ధులకు ఇతర ఇతర సామాజిక పరంగా కూడా పింఛన్లను అందిస్తున్న పెద్దకొడుకు కేసిఆరే అని అన్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఈ తరుణంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఆవశ్యకత ప్రజాప్రతినిధులు అధికారుల పైన ఎంతైనా ఉందన్నారు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చే కార్యక్రమాలను 22 రోజుల కార్యక్రమాలను పూర్తిస్థాయిలో ఊరురా దిగ్విజయంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారుల పైన ఉందన్నారు.