Saturday, 7 November 2026

అన్ని మతాలను గౌరవించడమే ప్రభుత్వ లక్ష్యం

అన్ని మతాలను గౌరవించడమే ప్రభుత్వ లక్ష్యం
* క్రైస్తవులకు దుస్తుల పంపిణీలో ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, డిసెంబర్ 20( జనం సాక్షి ): క్రైస్తవ మతస్తులకు దుస్తుల పంపిణీ ( క్రిస్మస్ గిఫ్ట్‌ ప్యాక్‌)లను ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ చేతుల మీదుగా అందజేశారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రం లోని చర్చిలో మండలంలోని క్రైస్తవ మతస్తుల పాస్టర్లకు స్థానిక తహసిల్దార్ కెవి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరుణ ప్రేమ సేవ ఏసుప్రభు మార్గమని అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అన్ని మతాలు గౌరవించబడుతున్నాయని, ముఖ్యమైన మత పండుగలలో ఎందరో పేదవారు పండుగలను ఘనంగా జరుపుకోవాలని ముస్లింలకు రంజాన్, దసరాకు బతుకమ్మ చీరలు, క్రైస్తవులకు దుస్తుల పంపిణీ తో పాటు సహపంక్తి భోజనాలు అధికారికంగా చేపట్టడం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటా చేరుతున్నాయని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, పింఛన్లు, రైతులకు రైతుబంధు, పోడు భూములకు పట్టా హక్కులు, రాజకీయాల కతీతంగా, కులాల కతీతంగా కూడా పేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లనుతెలిపారు.అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను చేపడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని, స్థానికంగా తిరిగి టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం మండలంలో మంజూరైన కళ్యాణి లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య