అన్ని వర్గాల ప్రజల ఆరాధ్యుడు అంబేద్కర్ : ఆఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు బోయిని రవిందర్ లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు అఫ్జల్ ఖాన్,రవిందర్ లు మాట్లాడుతు.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల కు ఎనలేని సేవలు చేశారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు అనుసరించి సమాజం లో సమ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అఫ్జల్ ఖాన్,రవిందర్ లు మాట్లాడుతు కోరారు .ఈ కార్యక్రమంలో మహ్మద్ అఫ్జల్ ఖాన్,రవిందర్ ల తో పాటు మండల ఉపాధ్యక్షులు దెశం శ్రీకాంత్ గౌడ్, వార్డు సభ్యులు దూడల శ్రీకాంత్ గౌడ్, అంకాల బాబు, డి ఆంజనేయులు,విక్కి, పోచయ్య, కుమార్,మురళి, నర్సింగ్ రావు, గణేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
26ఎస్పీటీ -3: అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న నాయకులు
అన్ని వర్గాల ప్రజల ఆరాధ్యుడు అంబేద్కర్ : ఆఫ్జల్ ఖాన్




