Wednesday, 4 November 2026

అఫ్జల్ ఖాన్ కు ఎమ్మెల్సీ రావాలని దర్గాలో ముస్లిం సోదరులు ప్రార్థనలు

: శామీర్ పేట్, జనం సాక్షి :శుక్రవారం శామీర్ పేట లో ని సయ్యద్ జలాలుద్దీన్ ముల్తానీ బాబా దర్గ్హా లో ముస్లిం సోదరులు అఫ్జల్ ఖాన్ కు ఎమ్మెల్సీ పదవి రావడానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా శామీర్ పేట కు చెందిన బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అఫ్జల్ ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నందున స్థానికంగా చుట్టు పక్కల ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు మలి దశ ఉద్యమం లో తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేశానని, తెలంగాణ వచ్చేక ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే తనకు ఎమ్మెల్సీ పదవి మైనారిటీ రిజర్వేషన్ కోటా లో కానీ, గవర్నర్ కోటా లో కానీ ఏ విధంగా వచ్చిన సంతోషమేనని అఫ్జల్ ఖాన్ అన్నారు . ఎమ్మెల్సీ పదవి కోసం అభిమానుల, పార్టీ నాయకుల ఉత్సాహం తారా స్తాయికి చేరిందని, అయితే తనకు పదవులు వచ్చినా, రాకపోయినా పార్టీ బలోపేతానికి కేసిఆర్ గారి వెన్నంటే పని చేయటం జరుగుతుందని అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు మహ్మద్ అజ్మత్, సమీ, అశ్రఫ్, వాజీద్, తయ్యబ్, షఫీ తదితర మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.