Tuesday, 3 November 2026

అన్ని సర్వేల్లోనూ కుంభం టాప్ కుంభం నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం కుంభంను ఎమ్మెల్యేగా చూడాలన్నదే సామాన్య ప్రజల కోరిక

భువనగిరి టౌన్ జనం సాక్షి:–తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భువనగిరిలో నిర్వహించిన ప్రముఖ సర్వే రిపోర్టుల ఆధారంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు సురుపంగ చందు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గతంలో నియోజకవర్గ ఇన్చార్జిగాను, ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను భువనగిరి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ హై కమాండ్ ఏ కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన వాటిని విజయవంతం చేసి కాంగ్రెస్ అగ్ర నాయకుల మన్ననలు పొందిన వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి అని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకునేది అనిల్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడటమని అది త్వరలోనే నెరవేరబోతుందని అన్నారు. కరోనా కష్ట సమయం లో ఏ రాజకీయ నాయకుడు చేయని సేవ అనిల్ కుమార్ రెడ్డి చేశారని, నిత్యం ప్రజల్లో ఉంటూ, ఆపద సమయంలో అండగా ఉంటూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి అని అన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ, వాళ్ళు చేస్తున్న తప్పులను నిలదీస్తూ నిత్యం ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని లోతుగా తీసుకెళ్లిన నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి గారే అని అన్నారు. ఈసారి కాంగ్రెస్ హై కమాండ్ దృష్టిలో ఎమ్మెల్యేగా గెలిచే అభ్యర్థుల మొదటి వరుసలో అనిల్ రెడ్డి ఉన్నారని అన్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు, చిన్నారుల నుండి వృద్ధుల వరకు, విద్యార్ధులు, యువకులు సామాన్య ప్రజలు సైతం భువనగిరి ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నారు.అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని, కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని అందరూ సమిష్టిగా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఉపేందర్, కోందోజు సతీష్, సిరికొండ తేజ తదితరులు పాల్గొన్నారు.