Tuesday, 3 November 2026

అన్యక్రాంతమవుతున్న హూడా భూమిచట్టానికి సవాల్ విసురుతున్న అక్రమార్కులు * నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు * అధికారుల తీరు పట్ల అనుమానాలు

 

 

 

 

 

 

 

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 29 :-.   జవహర్ నగర్ ప్రాంతంలో గల హెచ్ ఎం డి ఏ భూములను పరిరక్షించేందుకు హుడా అధికార యంత్రాంగం విధి నిర్వహణలో ఉందా లేదా అనే అనుమానాలు జవహర్ నగర్ స్థానికుల నుండి వ్యక్తం అవుతున్నాయి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భాగ్యనగర్ కమాన్ వద్దగల 315 , 316 సర్వే నెంబర్ల కు చెందిన హూడా భూమిలో చట్టానికి సవాల్ విసురుతు నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎంతో విలువైన హూడా భూమిని స్వాధీన పరుచుకోవడమే ఏకైక లక్ష్యంగా కబ్జా చేసి దుస్సాహసానికి ఒడిగట్టి అక్రమ మార్గంలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాన్ని హూడా అధికారులు పూర్తిస్థాయిలో తొలగించి ఈ దుస్సాహానికి ఒడిగట్టిన అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటీ…? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హుడా భూములను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించడమే ఏకైక లక్ష్యంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న విలువైన స్థలాన్ని కబ్జా చేస్తూ పట్టపగలే నిర్మించిన ఈ అక్రమ నిర్మాణం వ్యవహారం పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అధికారులు అక్రమార్కులు ముట్ట చెప్పే ముడుపులకు ముచ్చటపడి ఈ హూడా భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందనే విషయాన్ని మరిచి విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారేమో అనే అనుమానాలు అపోహలు కూడా బాహాటంగానే వినిపిస్తున్నాయి హుడా అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఎలాంటి అనుమానాలకు తావివ్వని ఎడల ఈ హుడాభూమిలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని తొలగించి ఈ భూమిని పరిరక్షించే విషయంలో బాధ్యతారహితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే నిలదీతల పర్వం మొదలైంది అధికారులు విధి నిర్వహణలో అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ 315 316 సర్వే నెంబర్ల కు చెందిన హూడా భూమిలో వెలసిన ఈ అక్రమ నిర్మాణం నిలువెత్తు నిదర్శనం కాదా…? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా హూడా భూముల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న అధికారుల తీరుపట్ల సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని హుడా భూములను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు