(జనం సాక్షి )ముప్కాల్ ఏప్రిల్ 29.4సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న ముప్కాల్ మండల జూనియర్ పంచాయితీ కార్యదర్శులు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపు మేరకు మండల పరిషత్ కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు.తమ సమ్మె ప్రభుత్వ వ్యతిరేకం కాదని, కేవలం సమ్మె ద్వారా తమ ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.




