వరంగల్ బ్యూరో, మే 13 (జనం సాక్షి)25 సంవత్సరాల క్రితం ఓకే పాఠశాలలో ఒకే తరగతి గది లో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకుని తమ ఆనందాలను పంచుకున్న అద్భుత సన్నివేశాలు వరంగల్ జిల్లాలో ని తిమ్మాపూర్ హవేలీ నూతన విద్యా నిలయం పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. సుమారు 50 మంది విద్యార్థులు ఎక్కడెక్కడో నుంచి వారి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు తో వచ్చి తమ అనుభవాలను తాము ఏమేమి చేస్తున్నారో చెప్పారు గురువులు చూపిన బంగారు బాటలో నడవడం వల్లనే తాము ఈ ఉన్నత స్థాయికి చేరుకున్నామని పూర్వ విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు అంతేకాకుండా 25 సంవత్సరాల క్రితం తమకు విద్యాబోధనలు చేసిన ఉపాధ్యాయులను సగర్వగా సన్మానించారు. వారికి పాదాభివందనాలు చేసి తమగురుభక్తిని పూర్వ విద్యార్థులు చాటుకున్నారు. అదేవిధంగా సహపంతి భోజనం చేసి సంతోషాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెక్క యాదగిరి ,పోశాల కుమారస్వామి, తాడం వెంకటయ్య, షేర్ల భాస్కర్, చిగిరి కుమార్, గజ్జ సురేష్ బాబు, ఎండి మహబూబ్ అలీ మోతుపల్లి సత్యనారాయణ, రత్నం, మేరీ మార్గరేట్ తో పాటు విద్యార్థులు నిర్వాహకులు చంద్రశేఖర్, మానస, కిరణ్ కుమార్, ప్రదీప్ కుమార్, వహీదు తదితరులు పాల్గొన్నారు.




