Thursday, 5 November 2026

కర్ణాటక విజయం – నల్ల నేలలో జషన్..

 

 

 

 

 

 

కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలోగోదావరిఖని చౌరస్తాలో సంబరాలు
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ అద్భుతమైన విజయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరియు ఖర్గే చరిష్మా ముఖ్య పాత్ర పోషించిందని ఇదే స్ఫూర్తి తో దేశంలో త్వరలో జరిగే 4 రాష్ట్ర ఎన్నికలు ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా జిల్లా మాజీ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇంఛార్జి గా ఉన్న అన్ని నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మున్ముందు కూడా దేశంలో ఇక బీజేపీ పార్టీకి చరమ గీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ గెలుపు ఒక్క కాంగ్రెస్ పార్టీది కాదని కర్ణాటక ప్రజలదని గుర్తు చేస్తూ ఒకానొక దశలో ఎప్పటిలాగే బీజేపీ అగ్ర నాయకత్వం మత బాణాన్ని వదిలిన ,స్వయంగా అమిత్ షా , నడ్డాలు బెదిరించిన మోడీ ముసలి కన్నీరు కారుస్తూ రోడ్ షో లు చేసిన కూడా కర్ణాటక ప్రజలు అదరక , బెదరక , విజ్ఞతతో & ఓర్పుతో తమ ఓటు ద్వారా బీజేపీ కి సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పారని తెలంగాణలో కూడా బిజెపికి అంట కాగుతున్న కెసిఆర్ అవినీతి పాలనను కూడా ఇక్కడ ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు

ఈ కార్యక్రమం లో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి గారు , సెంట్రల్ జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్ , అర్జీ వన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం , అర్జీ 2 వైస్ ప్రెసిడెంట్ అక్బర్ అలీ , మనోహర్ , శ్రీనివాస్ ,పోచయ్య , మహేష్ బాబు , సత్యనారాయణ , మార్కండేయ, అల్లావుద్దీన్ , సాగర్ , కుమార స్వామి , మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.