Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన సంబరాలు

 

 

 

 

 

 

 

 

ఇటిక్యాల (జనంసాక్షి) మే 13 : మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో శనివారం అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను గెలుపొందిన సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో దుర్మార్గ బిజెపి పాలనకు చరమగీతం పాడుతూ ఇందిరమ్మ రాజ్యం కోసం అక్కడి నాయకులు, కార్యకర్తలు చేసిన కృషికి ప్రతిఫలంగా కాంగ్రెస్ విజయం దక్కించుకుందని వారి శ్రమ వృధా కాకూడదని ఆయన ఆకాంక్షించారు. కర్ణాటక విషయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధిరామయ్య లకు అలంపూర్ యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో విజయ దుందుభి మోగించిన మాదిరిగానే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బిజెపి చేస్తున్న కుట్ర రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎండ గట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మవరం బ్రహ్మేశ్వర్ నాయుడు, పుటాన్ దొడ్డి వెంకటేష్, మంద జగన్నాథం, వెంకటన్న తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.