మిర్యాలగూడ జనం సాక్షి. పొగాకు పలు రకాలుగా శరీరంలోకి వ్యాపిస్తుందని దీని కారణంగా ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపిస్తాయని ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధుల వైద్యులు డాక్టర్ విజయేందర్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక అపోలో రీచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి రాజీవ్ చౌక్ వద్ద పొగాకు ఉత్పత్తులైన బీడీ, సిగరెట్,చుట్ట,తంబాకు,గుట్కా, పాన్ మసాలా, జర్దా ప్యాకెట్లను తగలబెట్టి పొగాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం వలన మెదడులో డోకోమాన్ అనే రసాయనం ఉత్పత్తి అయి ఈడోపేమన్ అనేది ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలుగజేస్తుందని, ఆనందం కోసం మళ్లీమళ్లీ పొగాకు ఉత్పత్తులను సేవించాలని మనసు వ్యక్తిపై ప్రభావితం చేస్తుందని అన్నారు. పొగాకు వినియోగం వల్ల వచ్చే దుష్పరిణామాలను తెలుసుకున్నప్పటికీ దానిని మానివేసేందుకు ఎవరిని సంప్రదించాలి, ఎలాంటి సలహాలు తీసుకోవాలి అనే విషయాలు తెలియక చాలామంది ప్రాణం మీదికి తెచ్చుకుంటారన్నారు . తమ అపోలో రీచ్ హాస్పిటల్ లో నేటి నుండి మూడు రోజులు పాటు పొగాకు మానిపించడానికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు చాతి ఎక్స్ రే, పి ఎఫ్ టి, సి బి పి పరీక్షలు పల్మనాలజిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఈ అవకాశాన్ని పొగాకు బాధితులు వినియోగించుకోవాలని డాక్టర్ విజేందర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ ఇంచార్జ్ బేసిల్, ఎగ్జిక్యూటివ్ కోల నాగరాజు. మార్కెటింగ్ ప్రతినిధులు సుమన్,రవీందర్,హరీష్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
అపోలో రీచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం




