వేములవాడ, మే 31 (జనంసాక్షి)ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల్లో నిరుద్యోగ సమస్య ను తీర్చడానికి ప్రత్యేక కృషి చేస్తానాని ప్రతిమ పౌండేషన్ చేర్మెన్ చెన్నమనేని వికాస్ రావు, దీప దంపతుల హామీ
వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లి గ్రామంలో ఉచిత శుద్ధజల కేంద్రాన్ని అయన చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు.నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వారు స్పష్టం చేసారు..ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నవీన -రాజు, ఎంపిటిసి లహరి- శేఖర్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు,పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు..




