Tuesday, 3 November 2026

ఎస్సైని సన్మాంచిన మండల ప్రెస్ క్లబ్ సభ్యులు

 

 

 

 

పెన్ పహాడ్ మే 30 జనం సాక్షి) : స్థానిక ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ సోమవారం వెలుబడిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేతేపల్లి మండలానికి బదిలీ కాగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఒగ్గు సోమన్న ఆధ్వర్యంలో పాత్రికేయులు మంగళవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ తాను 25 నేలలుగా మండలంలో విధులు నిర్వహిస్తు వచ్చానని మండల ప్రజలు,పాత్రికేయ మిత్రులు తనతో స్నేహ భావంతో మెలిగారని అన్నారు తనను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వగ్గు సోమన్న, గౌరవ అధ్యక్షులు ధనియాకుల వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు చలిగంటి పుల్లారావు,చట్టు వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ సభ్యులు తుమ్మ కొమ్మ సంజయ్, మీసాలనాగయ్య, బోల్లి కొండ వీరాస్వామి, నన్నే పంగ నవీన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…