జనం సాక్షి/ కొల్చారం మండలంలో ఆషాడం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామంలో ఆషాడం మాసం పురస్కరించుకొని శ్రీ రేణుక మాత ఎల్లమ్మ కు బోనాల ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో మహిళలు మట్టికుండలో అమ్మవారికి బోనం తీసుకుని డబ్బు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు
అప్పాజీపల్లి లో అంగరంగ వైభవంగా. ఆషాడ మాస బోనాల పండగ సందడి




