Tuesday, 3 November 2026

బి కే బజార్ ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమణను వెంటనే తొలగించాలి అని మేయర్ కీ వినతి.

రఘునాథ పాలెం జూన్ 27(జనం సాక్షి)
స్థానిక ఖమ్మం నగరంలోని 42వ డివిజన్లో బి కే బజార్ లో మంచినీళ్ళ బావి సుమారు 100 సంవత్సరాల నుండి ఉండేది. దాని చుట్టుపక్కల ఎస్సీ కమ్యూనిటీ కుటుంబాలు మొత్తం ఆ బావిలోని నీరు వాడుకొని నివసించేవారు. గత ఆరు సంవత్సరాల క్రితం బావిని పుడ్చేవేసి అట్టి స్థలంలో కమిటీ హాల్ కొరకు మునిసిపాలిటీలో పది 10 లక్షలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుండి మంజూరు చేసి టెండర్ ని పిలవడం జరిగింది. అనివార్య కారణాల వలన కాంట్రాక్టర్ కమిటీ హాల్ను నిర్మించలేకపోయారు. అట్టి స్థలంలో స్థానిక కార్పొరేటర్ అయిన శ్రీమతి వాకలపాటి విజయనిర్మల తన లెటర్ ప్యాడ్ మీద రాసి మేయర్ గారి అనుమతి కొరకు పంపారు. దానిని మేయర్ పరిశీలించి సానుకూలంగా స్పందించారు.ఈలోగా దాని పక్కన స్థలాన్ని శ్రీ హావిశ హాస్పిటల్ యజమాని అయిన పార నాగేశ్వరరావు కొంత భాగాన్ని ఆక్రమించి, ప్రహరీ గోడ కట్టి గేటు నిర్మించినారు. కావున మా యందు దయ ఉంచి అట్టి నిర్మాణాన్ని తొలగించి యధావిధిగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ను నిర్మించాల్సిందిగా తమను కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు గుంతెటి వీరభద్రయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ పెరుగు వెంకటరమణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, జిల్లా నాయకులు చింతపల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ బీసీ అధ్యక్షులు కనక బండి రవీందర్, స్థానిక మాల మహానాడు నాయకులు ఫిరంగి రాములు,సవ్వడి వాసు,దర్గయ్య, శ్రీధర్, వెంకటేశ్వర్లు, కొర్లపాటి శ్రీను తో పాటు కార్పొరేటర్ శ్రీమతి విజయ నిర్మల ,శేషగిరి తదితరులు పాల్గొన్నారు.