బోయిన్ పల్లి జున్ 27 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి గ్రామం లో గల సర్వేనం 20 లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి కొనుగోలు చేసి పాత హద్దులను తొలగించి తూర్పు చెరువు కట్టపైకి చొరబడి హద్దు రాళ్ళు తొలగించి ఇష్టం వచ్చినంతభూమి కబ్జా చేసి హద్దురాళ్ళు ప్రాంతినారు. బోయినపల్లి గ్రామ తూర్పు చెరువు
కట్టా సర్వేనెంబర్ 20 ను ఆనుకొని ఉన్నది. ఇదే అదునుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టాను కబ్జా చేశారని బోయిన్ పల్లి తాసిల్దార్ నరేష్ కు వినతి పత్రం ఇచ్చినట్లు కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు బోయిన్ పల్లి మాజీ సర్పంచ్ సంభాలక్ష్మి రాజం తెలిపారు.
చెరువు కట్ట కబ్జాపై తహసిల్దార్ కు వినతి పత్రం




