Wednesday, 4 November 2026

అప్పుడు కొట్టుకుపోయి.. ఇప్పుడు మళ్లీ గండి పడింది

అప్పుడు కొట్టుకుపోయి.. ఇప్పుడు మళ్లీ గండి పడింది.

చెక్ డ్యాం నిర్మాణ పనుల్లో నాణ్యతకు ,’నీల్లో ” దిలారు.

కస్బేకట్కూర్ చెక్ డ్యాం గండిపడి నీళ్లు ఖాళీ.

చూసి చూడనట్లు అధికారులు_నోరు మెదపని నాయకులు.

కోట్ల నిధులు నీళ్లల్లో పోసినట్టే …

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 5.(జనంసాక్షి). మంత్రి కేటీఆర్ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ తరచూ ఒక మాట చెబుతారు. చుక్కనీరు కనిపించని మానేరుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చామని త్వరలోనే మొత్తం మానేరు వాగంత జలకళ ను సంతరించుకుంటుందని చెబుతూ వస్తారు. కాళేశ్వరం, రాజరాజేశ్వర జలాశయంతో ఇప్పటికే లక్ష్యం నెరవేరిందని మానేరు వాగు లో చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా పూర్తిస్థాయిలో జలకళ ను తీసుకొస్తామని చెబుతూ వచ్చారు. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపం మంత్రి సంకల్పాన్ని నీరుగారుస్తున్నట్లే ఉంది. మానేరు వాగు పై నిర్మిస్తున్న ఓ చెక్ డ్యాం నిర్మాణం జరుగుతుండగానే వరదలకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. తిరిగి రెండోసారి నిర్మాణం చేసిన మళ్లీ లీకేజీలు పునరావృతమై చుక్కనీరు లేకుండా పోయిన పరిస్థితి ఉంది.

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మానేరు వాగు పై అప్పర్ మానేరు నుండి మధ్య మనేరు వరకు 11 చెక్ డ్యాములు, మూల వాగు పై 13 చెక్ డ్యాం లు నిర్మాణం చేసెందుకు గతంలోని 155. కోట్లతో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అధికారుల పనులు వేగంగా జరుగుతున్నట్లు చెపుతు వస్తున్నారు. మొత్తం 24 చెక్ డ్యాముల్లో మూడు నిర్మాణం పూర్తి చేసుకున్నయని , 9 చెక్ డ్యామ్ నిర్మాణం పనులు పూర్తయ్యాయని మిగిలినవి 80% పైగా పూర్తయినట్లు లెక్కలు చెబుతున్నారు. ఇవి సరిపోక 68 కోట్ల 47 లక్షలతో మరో 12 కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు ఇచ్చిన నివేదికలు తెలుపుతున్నాయి. లెక్కల వరకు మాత్రం అంత బాగానే కనిపిస్తున్న పనుల నాణ్యత విషయంలో ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేకుండా పోతుందని నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల నుంచి స్థానికులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక విషదాలకు కారణమైన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని నిర్మించిన చెక్ డ్యాం విషయం తెలిసిందే. కట్టిన కొద్ది రోజులకి కొట్టుకుపోయిన క్రమంలో ఏర్పడిన గండి వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చెక్ డ్యాం నిర్మాణం పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. సరిగ్గా ఈ చెక్ డ్యాం కొట్టుకుపోయినప్పుడే తంగళ్ళపల్లి మండల పరిధిలోని కస్బ్ కట్కూర్, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ శివారులోని మానేరు వాగుపై నిర్మాణవుతున్న చెక్ డ్యామ్ కు గండి పడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

అధికారుల మౌనమే అసలు కారణమా..

సిరిసిల్ల మానేరు వాగు పై నిర్మిస్తున్న చెక్ ద్యాముల విషయంలో మొదటినుంచి నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం లేదని, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలే కాంట్రాక్టర్లు కావడంతో అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఆరోపణలు చేసినట్లే చెక్ డ్యాముల చిన్న వరదలకే చిల్లులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కస్బే కట్కూర్ చెక్ డ్యాం విషయంలోను అధికారుల ఉదసిన వైఖరి కోట్ల ప్రజాధనాన్ని నీళ్లు పాలు చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొదటిసారి గండి పడ్డప్పుడు పట్టించుకోకపోయినా తిరిగి రెండోసారి నిర్మాణం చేస్తున్న పుడైనా అధికారులు జాగ్రత్తగా తనిఖీలు చేయాల్సి ఉండగా ఎక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి కనిపించడం లేదు. నాణ్యత ప్రమాణాలు పాటించకచకపోవడం ఇప్పటికీ చెక్ డ్యామ్ పరిశీలిస్తే స్పష్టంగా కనిపిస్తుంది. సిమెంటు కంకర కలపవలసిన చోట ఖాళీ సిమెంట్ సంచుల్లో ఇసుక నింపి నిర్మాణల మధ్యలో వాడినట్లు తెలుస్తోంది. నవంబర్ నెలలో జలకలను సంతరించుకొని మానేరు వాగుకు కొత్త కళను తీసుకొచ్చిన చెక్ డ్యామ్ లీకేజీలతో నిలువ ఉండాల్సిన నీరు వెళ్ళిపోయి వెలవెల పోతోంది. కనీసం సరైన సమయంలో అయినా అధికారులు స్పందించి ఉంటే లీకేజీలు కాకుండా సరైన చర్య తీసుకుని ఉంటే బాగుండేదని పలు రైతులు తెలుపుతున్నారు. కోట్ల కొద్ది నిధులు నీళ్లలో పోసినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పవలసి ఉంది.