యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
* ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరి ప్రియ
టేకులపల్లి, జనవరి 5( జనం సాక్షి ): యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ అన్నారు. టేకులపల్లి లో ఐపీఎల్ హరిప్రియ కప్పు క్రికెట్ పోటీలను ఆర్గనైజర్ జాటోత్ నరేష్ నాయక్ క్రీడా నిర్వహణలో గురువారం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. యువ క్రీడాకారులకు తాము ఎప్పుడు అండగా ఉంటామన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో ఆణిముత్యాలు లాంటి క్రీడాకారులు ఉన్నారన్నారు. వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగం తో పాటు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,
బి ఆర్ ఎస్ నాయకులు బానోత్ రామానాయక్ , బానోత్ కిషన్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ భూక్య శ్రీనివాస్ , అంతోటి రాకేష్, కాలే అభినయ్, ఆర్గనైజర్స్ జాటోత్ నరేష్, టి ప్రవీణ్, బి సందీప్, ఈ వినోద్, బి హేమంత్,పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




