Wednesday, 4 November 2026

మున్నూరు కాపు మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ

మున్నూరు కాపు మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కేంద్రంలోని శ్రీసాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి రమేష్ మాట్లాడుతూ మున్నూరు కాపులంతా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగి చట్టసభల్లో ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు.మున్నూరు కాపుల కొరకు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మున్నూరు కాపులంతా ఐక్యతగా ఉండి సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జిల్లా యూత్ అధ్యక్షులు నల్లగుంట్ల సందీప్, పట్టణ అధ్యక్షులు డేగల రమేష్ నాయుడు, దంతాల వీరయ్య, ఉప్పు శ్రీనివాస్, రామసాని శ్రీనివాస్ నాయుడు, రామసాని రమేష్ నాయుడు, ఎలిమినేటి అభినయ్, మిర్యాల కృష్ణమూర్తి, గాలి శ్రీనివాస్, పిట్టల వెంకటేశ్వర్లు,ఎలిమినేటి నవీన్, తోట శ్రవణ్ కుమార్, గట్టు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.