అఫ్గాన్‌ కార్మికుల కోసం హెల్ప్‌ డెస్క్‌


అమరావతి,అగస్టు21(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866`243614, ?9177803 39884, ?919492555089, 89779 25653 నెంబర్లను సంప్రదించాలని కార్మికశాఖ కమిషనర్‌ రేఖారాణి సూచించారు. ఆప్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీకి చెందిన కార్మికులను రాష్టాన్రికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.