Wednesday, 4 November 2026

అఫ్జల్ ఖాన్ ఇఫ్తార్ విందుకు హాజరైన మర్రి రాజశేఖర్ రెడ్డి

 

 

 

 

 

 

 

శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్ పేటలో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతు.. పవిత్ర రంజాన్ మాసం లో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ముస్లిం సోదరులు ఈ మాసం లో చేసే ప్రార్థనలు ఫలించి అందరు సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఎంతో శ్రద్ధ గా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన అఫ్జల్ ఖాన్ కు మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అదే విధంగా భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వాపూరం కు చెందిన మైనారిటీ నాయకులైనటువంటి నజీర్ వారి మిత్రులు ఇఫ్తార్ విందు లో పాల్గొని అక్కడి ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆదేశాలతో అఫ్జల్ ఖాన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ అఫ్జల్ ఖాన్ తో పాటు ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, రైతు సహాకార సంఘం ఉపాధ్యక్షులు ఐలయ్య యాదవ్, టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, డి బాబు,వంగ నర్సింహ రెడ్డి, వార్డు సభ్యులు ఉప్పలయ్య, రవిందర్, నవీన్ ముదిరాజ్, బుర్క వెంకటేష్, నిరుడు ఆంజనేయులు, బత్తిని చందర్ గౌడ్, శ్రీనివాస్, అజ్మత్, తాడెం కుమార్,అశ్వాపూరం నాయకులు నజీర్, మహ్మద్ ఖాన్, ఆదం, తదితరులు పాల్గొన్నారు.