బెల్లంపల్లి, ఏప్రిల్ 20, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నూరేళ్లు జీవించాలని, ఎల్లవేళలా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి గద్దల నారాయణ, టీడీపీ పట్టణాధ్యక్షుడు మణిరాం సింగ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు లలిత, సునీత, సిరికొండ కనకయ్య, అనంతరం శంకరయ్య, గోగార్ల శేఖర్, కాసర్ల వెంకటేష్, దూడపాక రవి, బొల్లు మల్లయ్య, ఎండీ హాసన్, సదానందం, హరికిషన్ పాండే పాల్గొన్నారు.




