Thursday, 5 November 2026

అఫ్జల్ ఖాన్ జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొన్న సమాచార కమీషనర్ అమీర్

 :శామీర్ పేట్, జనం సాక్షి :కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మహ్మద్ అమీర్ అఫ్జల్ ఖాన్ నివాసానికి చేరుకొని అఫ్జల్ ఖాన్ కు శాలువా కప్పి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మహ్మద్ అమీర్ మాట్లాడుతు.. పార్టీ బలోపేతానికి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే, సామాజిక సేవ కార్యక్రమాలు చేసే అఫ్జల్ ఖాన్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అఫ్జల్ ఖాన్ కు మహ్మద్ అమీర్ ఆశిస్సులు అందజేశారు. అంతకుముందు శామీర్ పేట మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ క్రిష్ణ వారి బృందం తో అఫ్జల్ ఖాన్ నివాసానికి చేరుకొని కేక్ కట్ చేసి, అఫ్జల్ ఖాన్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అమీర్, మహ్మద్ అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, మహ్మద్ కలీం మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, మహ్మద్ గౌస్, బత్తుల శశికాంత్ యాదవ్, పి నర్సింహ రెడ్డి, పసుపుల నర్సింహ, శామీర్ పేట గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
22ఎస్పీటీ -1: జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న సమాచార కమీషనర్ అమీర్