వేములవాడ రూరల్, జనవరి 22 (జనం సాక్షి): ఉపాధ్యాయుల అన్ని క్యాడర్ల ప్రమోషన్ లో భాగంగా భాషా పండితులకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్ యు పి పి టీ ఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జనాపాల వెంకటయ్య పేర్కొన్నారు. భాషా పండితులు ఎస్జీటీలతో సమానమని పేర్కొంటూ, స్కూల్ అసిస్టెంట్ హోదాలో పనిని చేయించడం శ్రమ దోపిడీ అవుతుందని అన్నారు. పండితులను అప్ గ్రేడ్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వెంటనే అమలు చేయాలని కోరారు. పండితుల ప్రమోషన్లను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నాయకులు మంద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
భాషా పండితులకు పదోన్నతు లు కలిపించాలి




