అభయ ఫౌండేషన్ సహకారంతో 20 మంది టీబీ రోగులకు పౌష్టిక ఆహార కిట్స్ అందజేత
రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం (జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి టి బి ముక్త్ భారత్ అభియాన్ పథకం కింద అభయ ఫౌండేషన్ సహకారంతో 20 మంది టీబీ రోగులకు పౌష్టిక ఆహార కిట్స్ ఉచితంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా టిబి సెంటర్ నుండి రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ పథకం ద్వారా 2025 నాటికి టీబీని అంతం చేయాలని లక్ష్యంతో టీబి రోగులకు కేంద్ర ప్రభుత్వం నుండి నెలకు 500 రూపాయల చొప్పున ఆరు నెలల వరకు రోగుల బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది. జిల్లాలో 180 మంది క్షయ వ్యాధి గ్రస్తులు ఉండగా 20 మందికి అభయ ఫౌండేషన్ సహకారంతో పౌష్టికాహార కిట్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర మాట్లాడుతూ మా ఫౌండేషన్ నుండి ఈ కిట్టు లో 3 కిలోల బియ్యం, 1కిలో కందిపప్పు, మిల్క్ పౌడర్, న్యూట్రిషన్ పౌడర్, గుడ్లు మొదలైనవి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వినోద్ కుమార్, సూపరిండెంట్ శ్రీనివాస్, దండు మైలారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూర్ణ, జయమ్మ, గోపాల్ రెడ్డి, హేమ్లా నాయక్, ఇందిరా, టిబి సిబ్బంది మల్లిక, భానుచంద్, జ్యోతి, రజినీకాంత్ త్తదితరులు పాల్గొన్నారు




