Thursday, 5 November 2026

ప్రభుత్వ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

ప్రభుత్వ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
వేములవాడ, నవంబర్ 19 (జనం సాక్షి) : వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం స్వయం పరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల ఉపాధ్యాయులు మల్లేశం, ఆనందం, రవీందర్, సలాం, కోటేశ్వర్, హమీద్, శిరోమణి, జ్యోతి, శ్రీదేవి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.