అభివృద్ది పనులను పారదర్శకంగా చేపట్టాలి
– కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా చేపట్టబోయే అభివృద్ధి పనులను పారదర్శకంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు.గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు లింగమంతుల స్వామి జాతర నిర్వహణకై పలు సూచనలు చేశారు.రెండేళ్లకు ఒకసారి జరిగే లింగమంతుల జాతర రాష్ట్రంలోనే రెండవ అతి పెద్ద జాతర అని అన్నారు.ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని,వచ్చే భక్తులకు ఏటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీటి సదుపాయం, కోనేరు మరమ్మత్తులు, తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు.జాతీయ రహదారి నుండి గుట్ట వరకు రోడ్ మరమ్మత్తులు, జాతర జరిగే ఐదు రోజులు ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణతో పాటు గుడి పరిసర ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు అభివృద్ధి పనులను పారదర్శకంగా చేపట్టాలన్నారు.జాతర అభివృద్ది పనుల నిమిత్తం ప్రవేశ పెట్టిన నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రతి నెల సాధారణ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లు మడిపల్లి విక్రమ్, షఫీ వుల్లా, కొండపల్లి భద్రమ్మ , ఎడ్ల గంగాభవాని, వెలుగు వెంకన్న, వేములకొండ పద్మ , నెల్లుట్ల సోమలక్ష్మి పాల్గొన్నారు.




