Wednesday, 4 November 2026

చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి…

డోర్నకల్ ప్రతినిధి జనవరి 5 (జనం సాక్షి):

తొర్రూరు డీఎస్పీ రఘు నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికగా తనిఖీ నిర్వహించారు.
కేసులకు సంబంధించిన రికార్డ్స్ ఫైల్స్ ను పరిశీలించారు.
ఫిర్యాధుదారులకు న్యాయం జరిగేంత వరకూ వారికి అండగా నిలవాలని అన్నారు.
ప్రజలకు చేరువ అవడంలో అలసత్వం చూపరాదని అన్నారు.
సిబ్బంది తో మాట్లాడి పలు సలహాలు సూచనలు చేశారు. నేర పరిశోధనలో సాంకేతికను ఉపయోగించుకొని నిందితులకు శిక్ష పడే విధంగా సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచాలని అన్నారు
ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ సత్యనారాయణ నర్సింహులపేట ఎస్సై మంగిలాల్, సిబ్బంది పాల్గొన్నారు.