మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పనులను పర్యవేక్షించిన కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హుజూర్ నగర్ జనవరి 5 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హుజూర్ నగర్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా గురువారం సాయంత్రం కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు తో కలిసి హెలిప్యాడ్, పట్టణంలోని మార్కెట్ యార్డ్ దగ్గర ఇఎస్ఐ హాస్పిటల్, రామస్వామి గట్టు కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను, నూతనంగా నిర్మించిన శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలకు చెందిన శిలాఫలకాలను, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఎస్టీఓ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం హుజూర్ నగర్ ఆర్డిఓ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నేడు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకా రెడ్డి, ఆర్ అండ్ బి డి.ఈ మైపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ.ఈ యాకుబ్, డిపిఆర్ఓ రమేష్ కుమార్, ఎక్సైజ్ సూపర్డెంట్ కె.అనిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పనులను పర్యవేక్షించిన కలెక్టర్




