అభివృద్దే ద్యేయంగా పనిచేస్తాం – ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో విస్తృత పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను
ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 35 కోట్లతో నిర్మిస్తున్న ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, వచ్చే రెండు నెలల్లో ఫ్లై ఓవర్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలోనే 16 కోట్లతో రామకృష్ణాపూర్ పట్టణంలో అంతర్గత రోడ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ అధికారులు, మునిసిపల్ కమీషనర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు