Sunday, 8 November 2026

అభివృద్దే నా అభిమతం

అభివృద్దే నా అభిమతం

షాద్ నగర్ ఎమ్మెల్యే “ఎల్గనమోని అంజయ్య యాదవ్”

మీడియా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి వివరాల వెల్లడి

వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.242.34 కోట్ల రూపాయల మంజూరు

మరింత అభివృద్ధి కోసం అందరూ సహకరించండి

మానవతా దృక్పథంతోనే చటాన్ పల్లి బ్రిడ్జ్, జేపీ దర్గా అభివృద్ధి సమస్యలు

లక్ష్మీదేవి పల్లి రిజార్వాయర్ నిర్మించి తీరుతాం

నియోజకవర్గంలో నాణ్యమైన రోడ్లతో మహార్దశ

సొమ్ము మాది సోకుమాదే మధ్యలో మీకెందుకు – ప్రతిపక్షాలపై విసుర్లు

సహకరిస్తే కనివిని ఎరుగని అభివృద్ధి చేసి చూపిస్తా

షాద్ నగర్, సిటీటైమ్స్: ఎవరేమన్నా.. ఎన్ని సమస్యలు ఎదురైనా అభివృద్ధి నా అభిమతం. ప్రజలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎల్లకాలం ఉపయోగపడే పనులు చేపట్టాలన్నదే తన దృక్పధం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ టిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో పాటు నియోజక వర్గ మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ.. నియోజక వర్గంలో ఇటీవలే అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అంజయ్య వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతున్నట్లు ఆయన వివరించారు. నియోజక వర్గంలో ఇటీవల కాలంలో మంజూరైన పనుల గురించి ఆయన మీడియాకు వివరించారు. మరిన్ని శాఖల అభివృద్ధి గురించి తరువాత సమావేశంలో వివరిస్తానని చెప్పారు. మీడియా, ప్రజలు సహకారం అందిస్తే నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇటీవల అభివృద్ధి ఇలా..

షాద్ నగర్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అభివృద్ధిలో భాగంగా వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.242.34 కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం చేపట్టినట్లు వివరించారు.
అదేవిధంగా కొత్తూరు నుండి షాద్ నగర్ వరకు పాత జాతీయ రహదారి నిర్మాణం కోసం 45 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. అలాగే మరమ్మత్తుల కోసం రూ 61.90 కోట్లు మరియు మరో రూ 20.85 కోట్లు ప్రభుత్వం ఆమోదించినట్లు పేర్కొన్నారు. 37 గ్రామాలకు నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనాలు కోసం 7.4 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. అదేవిధంగా బీటీ రోడ్ల ప్రత్యేక మరమత్తు కోసం రూ 18.68 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే వరద ప్రభావంతో పాడైన రోడ్ల మరమ్మత్తు కోసం రూ 43.39 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. హెచ్ ఆర్ డిసిఎల్ నిధుల ద్వారా కొత్తూరు మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ధి కోసం 50 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. హెచ్ఎండిఏ నిధుల ద్వారా కొత్తూరు, షాద్ నగర్ మున్సిపాలిటీలకు చెరో 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ నిధుల ద్వారా తండాలకు రోడ్ల నిర్మాణం కోసం 8.12 కోట్లు మరియు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు, పోల్ వైర్ల కోసం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. ఇంకా మిగతా శాఖలకు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మరో మీడియా సమావేశంలో పూర్తిగా వివరిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

మానవతా దృక్పథంతోనే చటాన్ పల్లి బ్రిడ్జ్, జేపీ దర్గా అభివృద్ధి సమస్యలు

మానవత దృక్పథం దృశ్య చటాన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి అదే విధంగా జహంగీర్ పీర్ దర్గా మాస్టర్ ప్లాన్ విషయంలో కొంత సమస్యలు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే అంజయ్య స్పష్టం చేశారు. దాదాపు నిధులు మంజూరయ్యాయని సర్వేలు కూడా జరిగాయని అయితే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వద్ద చుట్టుపక్కల ఇల్లు కూల్చివేతలకు గురవుతాయని ప్రజలు ఆందోళన చేపట్టి అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేశారని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా జెపి దర్గా మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా మాస్టర్ ప్లాన్ అమలు అయితే అక్కడ నివసించే పేద ప్రజలు తమ వ్యాపార నివాసాలను కోల్పోయి రోడ్డున పడతారని వారికి పునరావాస చర్యలు చేపట్టి తద్వారా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ రెండు వ్యవహారాల్లో మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నామని త్వరలోనే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టించి తీరుతా

లక్ష్మీదేవి పల్లి పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయని కరివేన, ఉద్దండపూర్ తదితర ప్రాంతాల నుండి పనులు జరుగుత…