బచ్పన్ ప్లే స్కూల్ లో ఘనంగా గణిత జయంతి
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 22,
జనం సాక్షి :
మెట్ పల్లి పట్టణం కేంద్రంలోని బచ్పన్ ప్లే స్కూల్ లో ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామనుజన్ జయయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవము ను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్ధులు కేక్ కట్ చేసి, పలురకాల గణిత నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు గణితాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా సాధన చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.
బచ్పన్ ప్లే స్కూల్ లో ఘనంగా గణిత జయంతి




