అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరికలు శానంపూడి సైదిరెడ్డి


హుజూర్ నగర్ జులై 11 (జనంసాక్షి): బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామం నుండి మత్స్య శాఖ సంఘం నుండి 10 కుటుంబాలు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాల వలనే వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత దేశంలోని తెలంగాణ రాష్ట్రం అనేక పథకాలతో ముందు ఉందని, తెలంగాణ రాష్ట్రంలోని నీలి విప్లవంతో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణ మత్స్య సంపద వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు చేయడం జరుగుతుందనీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను, వివిధ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ, వెనుకబడిన వర్గాలను ఆదుకుంటూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కెసిఆర్ కిట్టు, మొదలైన పథకాలు ప్రవేశపెట్టి దేశంలోని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు