అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరిక

చిన్నంబావి సెప్టెంబర్ 30 జనం సాక్షి

చిన్నంబావి మండలం చిన్నమారు గ్రామానికి చెందిన 15 మంది యువకులు
సిఎం. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సుపరిపాలనకు ఆకర్షితులై ఎమ్మెల్యే కే మా మద్దతు అంటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువకులు నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో అన్నివర్గాలకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, కేసీఆర్‌ ప్రభుత్వం గొప్పగా పరి పాలిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనిక పాలనతో ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారని, పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం, స్థానం ఉంటుందన్నారు. బిఆర్ఎస్ పార్టీని నమ్మి చేరిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, నాయకులకు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే బీరం అన్నారు. అందరం కలిసికట్టుగా బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేద్దామని, కొల్లాపూర్ ప్రాంత అభివృద్దే మన అందరి ధ్యేయం, లక్ష్యం అని అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. సిఎం.కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో భవిష్యత్తులో కొల్లాపూర్ నియోజకవర్గంను అభివృద్దిలో మరింత ముందుకు తీసుకుపోదమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తో పాటు రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు పెద్ద మారు సర్పంచ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి, శివారెడ్డి, శ్రీధర్ రెడ్డి, సతీష్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.