-అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం.
-జర్నలిస్టులతో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.
-నేర నియంత్రణ కు మీడియా అందిస్తున్న సహకారం మరువలేనిది.
-జిల్లా ఎస్పీ కే మనోహర్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి2(జనంసాక్షి):
అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటు పడుడామని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్,ఎస్పీ మనోహర్ లు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కలెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్పీ మనోహర్, జాయింట్ కలెక్టర్ మోతిలాల్ లను కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సమాజంలో అన్ని వర్గాల సహకారం తీసుకుని జిల్లా అభివృద్ధికి పాటు పడతామని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఎస్పీ కే మనోహర్ పేర్కొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజం నుండి అన్ని వర్గాల సహకారంతో జిల్లా అభివృద్ధి పథం వైపు పయనిస్తుందని తెలిపారు. సమాజంలో మంచి చెడులను అధికారుల దృష్టికి తీసుకువచ్చే బాధ్యత మీడియా దేనని అందరూ సమిష్టిగా పనిచేసి అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు.జిల్లాలో నేర నియంత్రణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, ఇందుకు మీడియా అందిస్తున్న సహకారం మరువలేనిదని జిల్లా ఎస్పీ కే మనోహర్ పేర్కొన్నారు.కొత్త ఏడాదిలో నేర రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిద్దామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మోతిలాల్ కు కూడా జర్నలిస్టు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లాఖాన్ , సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్ ,జెమిని సురేష్,సురేష్ రావు,శేఖరా చారి , చంద్రశేఖర రావు,దినకర్ రావు,మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ అహ్మదుల్లా ఖాన్, సాక్షి రిపోర్టర్ రాజేష్, సత్యనారాయణ, నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ రాజు, సివిఆర్ సత్యం, ఐబీఎన్ రామకృష్ణ, ఏటిగడ్డ వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్,ఉదయం స్టాప్ రిపోర్టర్ మలిపెద్ది రమేష్, ప్రజాదర్బార్ స్టాప్ రిపోర్టర్ దాశరథం, జహంగీర్,సాజిద్, సైదులు తదితరులు పాల్గొన్నారు




