ఆర్.టి.ఐ తిరస్కరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
జిల్లా పవర్ లు మ్యాచ్ సంఘాల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిమ్మని ప్రకాష్.
సిరిసిల్ల. జనవరి 2.(జనం సాక్షి). ఆర్.టి.ఐ దరఖాస్తులు తిరస్కరించిన అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పౌరులు మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చివరి ప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చేనేత జోలి శాఖ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇందిరానగర్ గోదాములో ప్రభుత్వ క్లాత్ ఆర్డర్లను కొనుగోలు చేస్తున్న కన్సల్టేషన్ ఆఫీసర్ సామల శంకరయ్య ను పలు వివరాలు కోరుతూ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడం జరిగిందని చిమ్మని ప్రకాష్ కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వివరాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సదరు అధికారి అర్ టి ఐ ఫిర్యాదును తిరస్కరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్రకారం కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలు వెల్లోకి వస్తాయని ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వకుండా చేశారని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. జరిగిన అక్రమాలకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకొని ఆర్టిఐ దరఖాస్తులు తిరస్కరించిన అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో కోరినట్లు ప్రకాష్ తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో భీముని రామచంద్రం సభ్యులు ఉన్నారు




