Wednesday, 4 November 2026

అభివృద్ధిలో పోటీ పడకుండా అసత్య ప్రచారంలో

అభివృద్ధిలో పోటీ పడకుండా అసత్య ప్రచారంలో మునిగితేలుతున్న ఉత్తమ్ – బిఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామరక్ష
– నియోజకవర్గానికి మరో వంద కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషకరం
– నిన్న జరిగిన కేటీఆర్ సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జనవరి 7 (జనం సాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో పోటీ పడకుండా అసత్య ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మునిగితేలుతున్నాడని స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామరక్ష అని అన్నారు. నిన్న జరిగిన మంత్రి కేటీఆర్, జగదీశ్ రెడ్డి ల పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసిన బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ లో సుమారు 120 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, చేయడమే కాకుండా మరో వంద కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషకరంగా ఉందన్నారు. అందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ఇద్దరు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయగలడు, తాను నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పటం హాస్యస్పదమని అన్నారు. కేంద్ర నిధులు అన్ని బోర్డు కనబడితే చాలు తానే నిధులు తీసుకొస్తున్నా అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఇవన్నీ పచ్చి అబద్దాలని, ఎప్పుడు అబద్ధాల్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మునుగుతూ, తేలుతూ ఉంటాడని అన్నారు. ఉత్తమ్ ను ఆయన సొంత పార్టీ వాళ్లు కూడా నమ్మడం లేదని, నియోజకవర్గ ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. 50,000 మెజార్టీ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ముందు 50వేల ఓట్లు వస్తే ఆ తర్వాత గెలుపోవటమేలు చూసుకోవచ్చని అన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధిలో పోటీ పడకుండా అసత్య ప్రచారంలో మునిగితేలుతున్నారు అన్నారు. ఆయనని సొంత పార్టీ వారు నమ్మడం లేదు, బయట పార్టీ వారు నమ్మడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ముడెం గోపిరెడ్డి, సోమగాని ప్రదీప్, సైదులు, కిరణ్, అలీ, భాస్కర్ రెడ్డి, వివిధ మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.