Wednesday, 4 November 2026

భూవివాదంతో మందుతాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన మహిళ.

భూవివాదంతో మందుతాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన మహిళ…

– బైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించిన వైనం…

– మా భూమిని లాక్కోవలనే ప్రయత్నం మానండి అంటూ మహిళ ఏడుపు…

 

భైంసా రూరల్ జనవరి 07
జనం సాక్షి

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని(కే)గ్రామానికి చెందినటువంటి పిప్పెర ముత్తవ్వ గత 30 సంవత్సరాల నుండి తన పంటపొలాన్ని సాగు చేసుకుంటూనని, గడిచ0దా కు చెందిన దమ్మన్ వార్ కవిత పై ప్రస్తుతం ల్యాండ్ రిజిస్ట్రేషన్ వుంద0టూ… గత 30 సంవత్సరాల నుండి పిప్పర ముత్తవ్వ మరియు మేనకోడలు సుమలత,భర్త విజయ్ భూమిని సాగు చేస్తూ ఉండగా. ప్రస్తుతం భూమి కవితదంటూ… రిజిస్ట్రేషన్ కవితపై ఉన్నదంటూ ఈ భూమిని కాళీ చేయాలనికొన్నిరోజులనుండీకోరగా మా భూమిని అన్యాయంగా మీపైన చేసుకున్నారంటూ శనివారం కోడలు సుమలత వివాదంలో ఉన్నపంట పొలంలో మందుతాగిఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన పోలీసులు, స్థానికులు బై0సా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయి ఉన్న సుమలత గత 30 సంవత్సరాల నుండి మా అత్త వాళ్ళు సాగుచేసుకుంటున్నారని, ల్యాండ్ మాదేనని ఇప్పుడు అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకొని,లాక్కోవడం సరైన పద్ధతి కాదంటూ మాభూమిని అన్యాయంగా లాక్కుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానంటూ ఏడుస్తూ సుమలత ఆవేదన వ్యక్తం చేసింది.